ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు అని రష్మీ కోసం పాట పాడిన బాబు
on Jul 25, 2023
.webp)
ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రతీ వారం లాగే ఈ వారం కూడా నవ్వించడానికి వచ్చేసింది. ఇందులో జోడీస్ వేసే స్కిట్స్ కొన్ని నవ్విస్తున్నాయి కానీ కొన్ని మాత్రం పేలడమే లేదు. అలాంటి స్కిట్స్ మధ్య ఇమ్ము-వర్ష స్కిట్స్ కొంచెం నవ్వు తెప్పించేవిగా ఉంటున్నాయి. ఇక అలా ఈ వారం వర్ష-ఇమ్ము-బాబు మధ్య జరిగిన స్కిట్ లో బాబు రోడ్డు మీద కొరడాతో కొట్టుకుంటూ బిచ్చం అడిగే రోల్ లో నటించాడు. ఐతే ఇమ్ము తనకు ఈ స్కిట్ లో ఒక కూతురుంది అని ...ఆమెకు ఈమధ్యనే పెళ్లి చేశా అని చెప్పాడు. మరో వైపు బాబు - లేడీ కమెడియన్ బెగ్గర్ రోల్స్ లో కనిపించారు. తర్వాత బాబు స్టేజి మీదకు వచ్చి రష్మీ మీద సీరియస్ అయ్యాడు.."రష్మీ గారు మీకు ముందే చెప్పాను..నేను ఈ లవ్ ప్యాక్ ని చేయను..ఇది దీని ముఖం" అని పక్కన ఉన్న లేడీ కమెడియన్ ని చూపించేసరికి "ఆమె కూడా సీరియస్ అయ్యి మా అన్నయ్య ఏమన్నాడో తెలుసా జబర్దస్త్ లో ఇంతమంది ఉండగా నిన్నే అంటగట్టారేమిటి అని అడిగాడు" అని ఆమె చెప్పేసరికి అందరూ నవ్వేశారు..బాబు తన చేతిలో ఉన్న కొరడాతో అటు వర్షని, ఇటు మరో లేడీ పిచ్చ కొట్టుడు కొట్టేసాడు.
ఇంతలో ఇమ్మానుయేల్ బాబు దగ్గరకు వచ్చి "నువ్వు వెళ్లి రష్మీ దగ్గర కొరడాతో వీపు వాయించుకుని వస్తే లక్షలు లక్షలు డబ్బులు వస్తాయి" అని చెప్పాడు. "డబ్బులు కావాలంటే నేను కొట్టాలి" అంటూ రష్మీ బ్లాక్ డ్రెస్ అలా నడుచుకుంటూ వస్తుండేసరికి "ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు" అని పాట పాడాడు బాబు. వెంటనే రష్మీ బాబు చేతిలో కొరడా తీసుకుని లాగి పెట్టి ఒక్కటిచ్చింది. తర్వాత ఈ షోలో బులెట్ భాస్కర్ అండ్ టీంలోకి ఇన్స్టాగ్రామ్ ఫేమ్ శ్రీదేవి ఎంట్రీ ఇచ్చింది. ఈమె రీల్స్ అన్ని కూడా "ఆంటీ" మీద ఎక్కువగా ఉంటాయి..ఇలా ఫేమస్ ఐన ఈమెను ఈ షోకి తీసుకొచ్చారు. చాలా కాస్ట్ ఎక్కువగా టమాటో కాన్సెప్ట్ తో ఒక స్కిట్ లో నటించింది శ్రీదేవి. ఉల్లి ఫామిలీగా బులెట్ భాస్కర్ వాళ్ళు, టమాటో ఫామిలీగా శ్రీదేవి ఫామిలీ వాళ్ళు స్కిట్ వేసి ఎంటర్టైన్ చేశారు. ఇలా నెక్స్ట్ వీక్ కమెడియన్స్ అంతా అలరించడానికి రాబోతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



